తప్పంతా కేంద్రానిదే అంటున్న టీడీపీ..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్..

తప్పంతా కేంద్రానిదే అంటున్న టీడీపీ..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్..

దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి లిక్కర్‌ సేల్స్. ధరలు పెరిగినా ఫర్వాలేదు… లిక్కర్‌ ఉంటే చాలని మద్యం ప్రియులు ఫుల్‌ ఖుషీగా ఉంటే… పొలిటికల్‌ లీడర్స్‌ ఫైటింగ్‌కు రెడీ అయ్యారు. 40రోజుల తర్వాత తెరుచుకున్న షాపుల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు జనాలు. కరోనా ఎఫెక్టుతో ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాలు.. దీనిని కూడా అవకాశంగా మలుచుకుని ధరలు భారీగా పెంచుతున్నాయి. అధిక ధరలపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. ఆదాయం పెంచుకోవడానికి మారో మార్గం […]

Ram Naramaneni

|

May 05, 2020 | 11:21 PM

దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి లిక్కర్‌ సేల్స్. ధరలు పెరిగినా ఫర్వాలేదు… లిక్కర్‌ ఉంటే చాలని మద్యం ప్రియులు ఫుల్‌ ఖుషీగా ఉంటే… పొలిటికల్‌ లీడర్స్‌ ఫైటింగ్‌కు రెడీ అయ్యారు. 40రోజుల తర్వాత తెరుచుకున్న షాపుల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు జనాలు. కరోనా ఎఫెక్టుతో ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాలు.. దీనిని కూడా అవకాశంగా మలుచుకుని ధరలు భారీగా పెంచుతున్నాయి. అధిక ధరలపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. ఆదాయం పెంచుకోవడానికి మారో మార్గం లేదంటున్నాయి ప్రభుత్వాలు.

కాగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌కార‌మే మ‌ద్యం దుకాణాలు ఓపెన్ చేశామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. అయితే  దీనిపై  బీజేపీ నేత స‌త్య‌మూర్తి ఇచ్చిన ఆన్స‌ర్స్ పై టీవీ9 ర‌జినీకాంత్ అభ్యంత‌రాలు లేవ‌నెత్తారు. యూపీలో మద్యం అమ్మ‌కాలు అత్య‌ధికంగా జ‌రుగుతున్నాయ‌ని..బీజేపీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో రూ.300 కోట్ల అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని ర‌జినికాంత్ ప్ర‌శ్నించారు. దీనిపై బీజేపీ, టీడీపీ వెర్ష‌న్స్ ఈ వీడియోలో చూద్దాం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu