బాబోయ్… నేను అలాంటి వాడిని కాను..
కేసుల నుంచి బయటపడటం కోసమే బీజేపీలో చేరాననే ఆరోపణలకు కొట్టిపారేశారు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. గురువారం రాత్రి జరిగిన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. తమపై పెట్టిన కేసులకు భయపడి పార్టీ మారలేదని, ప్రస్తుతం తనపై ఉన్న కేసుల విషయంలో ఏమీ మాట్లాడలేనన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సి రావడం వెనుక కారణం ఏమిటని, కేవలం కేసులు నుంచి తప్పించుకోడానికే బీజేపీలో చేరారనే ఆరోపణలపై టీవీ9 […]
కేసుల నుంచి బయటపడటం కోసమే బీజేపీలో చేరాననే ఆరోపణలకు కొట్టిపారేశారు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. గురువారం రాత్రి జరిగిన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. తమపై పెట్టిన కేసులకు భయపడి పార్టీ మారలేదని, ప్రస్తుతం తనపై ఉన్న కేసుల విషయంలో ఏమీ మాట్లాడలేనన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సి రావడం వెనుక కారణం ఏమిటని, కేవలం కేసులు నుంచి తప్పించుకోడానికే బీజేపీలో చేరారనే ఆరోపణలపై టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ అడిగినప్రశ్నకు వాకాటి సమాధానమిచ్చారు. కేవలం తనమీద పెట్టిన కేసులు ఆరోపణలు మాత్రమేనన్నారు. ఇంకా కోర్టులో నిరూపణ కావాలన్నారు.