చరణ్ నీ గురించి ఏం చెప్పాలి రా.. మీడియా ముందే తమన్నా..

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌‌ను తీర్చేందుకు రామ్ చరణ్ కోట్లు ఖర్చు పెట్టి సైరా నరసింహా రెడ్డి మూవీని తెరకెక్కించాడు. అయితే ప్రేక్షకుల నుంచి అనుకున్న దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ.. ఆడియన్స్ ఆదరిస్తున్నారు. టాలీవుడ్‌లో బాహుబలి, సాహో, బాలీవుడ్‌లో అయితే హృతిక్ రోషన్ లాంటి బడా స్టార్ల రికార్డులను బ్రేక్ చేసింది. విడుదలై ఒక్క రోజే అయినా కోట్లు వసూలు చేసింది. దీంతో సైరా చిత్ర బృందం సక్సెస్‌ను ఎంజాయ్ […]

చరణ్ నీ గురించి ఏం చెప్పాలి రా.. మీడియా ముందే తమన్నా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 04, 2019 | 11:52 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌‌ను తీర్చేందుకు రామ్ చరణ్ కోట్లు ఖర్చు పెట్టి సైరా నరసింహా రెడ్డి మూవీని తెరకెక్కించాడు. అయితే ప్రేక్షకుల నుంచి అనుకున్న దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ.. ఆడియన్స్ ఆదరిస్తున్నారు. టాలీవుడ్‌లో బాహుబలి, సాహో, బాలీవుడ్‌లో అయితే హృతిక్ రోషన్ లాంటి బడా స్టార్ల రికార్డులను బ్రేక్ చేసింది. విడుదలై ఒక్క రోజే అయినా కోట్లు వసూలు చేసింది. దీంతో సైరా చిత్ర బృందం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో తమన్నా కూడా ఒకరు. కాగా, శర్వానంద్ రామ్ చరణ్‌కి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. వీరికి ఒక గ్యాంగ్ కూడా ఉంది. వీరు ఎప్పుడు బయట కలిసినా బాగా ఎంజాయ్ చేస్తారు. కాని మీడియా ముందు ఎప్పుడు ఏరా ఒరేయ్ అనేంత చనువు మాత్రం తీసుకోలేదు. ఆఫ్ కెమెరాలో ఎలా ఉన్నా బయటికి వచ్చినప్పుడు మాత్రం ఏకవచనంతో పిలుచుకుంటారు. కాని తమన్నా మాత్రం చిరంజీవి ముందే చరణ్ ని ఏరా అనేసింది.

సైరా సినిమాలో తమన్నా లక్ష్మీపాత్రలో నటించింది. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది ఈ కారెక్టర్. దాంతో ఆనందంలో మునిగిపోయిన తమన్నా.. తాజాగా సైరా సక్సెస్ మీట్‌లో పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. చివరికి చరణ్ దగ్గరికి వచ్చేసరికి.. నిన్ను నిర్మాతగా చూడాలా.. హీరోగా చూడాలా.. ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ తమన్నా నోరుజారింది. అయితే ఈ సినిమాకి ముందు నుంచే వీళ్లు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి రచ్చ సినిమాలో కూడా నటించారు.