టీవీ ఆర్టిస్ట్ సూసైడ్ యత్నం!

టీవీ ఆర్టిస్ట్ జయశ్రీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులో తిరువాణ్మయూర్‌కు చెందిన ఈశ్వర్, జయశ్రీ ఇద్దరూ టీవీ నటులు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇదివరకే తన భర్త మీద ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త ఈశ్వర్‌కు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. కాగా.. బుధవారం వండలూర్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:06 am, Fri, 17 January 20
టీవీ ఆర్టిస్ట్ సూసైడ్ యత్నం!

టీవీ ఆర్టిస్ట్ జయశ్రీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులో తిరువాణ్మయూర్‌కు చెందిన ఈశ్వర్, జయశ్రీ ఇద్దరూ టీవీ నటులు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇదివరకే తన భర్త మీద ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త ఈశ్వర్‌కు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. బుధవారం వండలూర్ ప్రాంతంలోని గుడిసెలు దగ్ధమయిన సందర్భంగా.. బాధితులను పరామర్శించడానికి ప్రమాదస్థలానికి కారులో వెళ్లింది జయశ్రీ. తిరిగి వెళ్తుండగా భర్త నుంచి ఫోన్ వచ్చింది. అతనితో మాట్లాడిన అనంతరం ఆమె ఓ మెడికల్ షాపులో నిద్రమాత్రలు తీసుకుని మింగింది. నీలాంగరై సముద్ర తీరంలోకి రాగానే జయశ్రీ మైకంతో కింద పడిపోయింది. దీంతో.. ఆమెతో వచ్చిన మరో వ్యక్తి జయశ్రీని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చెక్‌ చేసిన వైద్యులు పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలిపారు.