AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఈ దిక్కున పెడితే రాజయోగం.. డబ్బే డబ్బు..

తులసి కేవలం ఒక మొక్క కాదు, భారతీయ సంప్రదాయంలో దేవతా వృక్షంగా పూజలందుకుంటుంది.. అయితే.. అలాంటి తులసి మొక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలనేది చాలామందికి ఉన్న ప్రశ్న.. తులసి దేవతా వృక్షమే కాకుండా, శాస్త్రీయంగా ఆక్సిజన్‌ను విడుదల చేసే, ఔషధ గుణాలున్న మొక్క. ఇది ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి, విష్ణువుకు ప్రీతిపాత్రమైనది.

తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఈ దిక్కున పెడితే రాజయోగం.. డబ్బే డబ్బు..
Tulasi Plant Placement
Shaik Madar Saheb
|

Updated on: May 02, 2026 | 1:45 PM

Share

తులసి (Holy Basil) ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క.. దీనితో ఎన్నో సమస్యలను నయం చేసుకోవచ్చు.. అయితే..హిందూ సంప్రదాయంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనది.. లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణుప్రియగా పూజిస్తారు. ప్రతి ఇంట్లోనూ తులసికోట ఉండటం శుభప్రదం.. ఇది సానుకూల శక్తికి, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు.. అంతేకాకుండా.. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పేర్కొంటారు.. అయితే.. తులసి మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టాలనేది అనేకమందికి తరచుగా తలెత్తే ప్రశ్న. ఈ విషయంపై వాస్తుశాస్త్ర నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. తులసి కేవలం ఒక మొక్క కాదని, ఇది మన సంప్రదాయంలో దేవతా వృక్షంగా, తులసి మాతగా కొలవబడుతుందని.. అందుకే.. తులసి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు..

ఆధ్యాత్మిక విలువలతో పాటు, తులసికి గొప్ప శాస్త్రీయ ప్రాధాన్యత కూడా ఉంది. తులసి మొక్క అధిక ప్రాణవాయువును విడుదల చేయగల మొక్కలలో ఒకటిగా గుర్తించబడింది. అనేక రోగాలకు తులసి పరమౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి చిన్నపిల్లల సమస్యలకు తులసి ఆకు రసం దివ్యౌషధంగా వినియోగిస్తారు. ముఖ్యంగా ఆలయాల్లో అందించే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగించడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ఇది ప్రాణశక్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు.. కృష్ణుడు రుక్మిణమ్మ ఇచ్చిన రెండు తులసి ఆకులకు తూగాడు అనే పురాణ గాథ ద్వారా తులసి ఆకుల గొప్పతనం, పరమాత్మ తత్వం వెల్లడవుతుంది.

తులసికోట స్థానం విషయానికొస్తే, నిర్దిష్టమైన కఠిన నియమాలు లేనప్పటికీ కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి. తూర్పు ముఖద్వారం ఉన్న ఇళ్లకు ఈశాన్య మూల అనుకూలంగా ఉంటుందని, పడమర ముఖద్వారం ఉన్నవారు కుడివైపున (నైరుతి దిక్కు కాకుండా) ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్కను ఇంట్లో ఈశాన్యం (North-East), ఉత్తరం (North) లేదా తూర్పు (East) దిక్కులలో నాటడం అత్యంత శుభప్రదం. ఈ దిక్కులు సానుకూల శక్తిని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పెంచుతాయని పేర్కొంటున్నారు.

అయితే.. తులసికోటను కనీసం రెండు అడుగుల ఎత్తులో నిర్మించాలని, దీనికి ముఖ్య కారణం శుభ్రం చేసేటప్పుడు మురికి నీరు అందులో పడకుండా ఉండటమేనని పేర్కొంటున్నారు.. ఇది వాస్తుదోష నివారణకు కాకుండా, పరిశుభ్రతను పాటించేందుకు ఏర్పాటు చేసుకున్న వెసులుబాటు అంటున్నారు.

పాతకాలపు గ్రామాలలో, సినిమాలలో చూసినట్లుగా, తులసికోట ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేది. దీని వెనుక మన పూర్వీకుల విశాల దృష్టి ఉంది. గుమ్మం ఎదురుగా తులసి ఉండటం వల్ల వీచే గాలి తులసి మొక్క మీదుగా ఇంట్లోకి ప్రవేశించి ప్రాణవాయువును అందిస్తుంది. ఇది కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా, తులసి  పచ్చదనం కళ్లకు ఆనందాన్ని, మెదడుకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఇంటి వెనుక వైపు..

అయితే, ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రజలు అత్యంత వేగంగా, కొన్నిసార్లు అజాగ్రత్తగా ఇంటి లోపలికి వస్తుంటారు. దేవతా స్వరూపమైన తులసి మొక్కను అపవిత్రంగా తాకే అవకాశం ఉంటుంది. కొందరు పవిత్రతకు సంబంధించిన నియమాలను పాటించకపోవచ్చు. అలాంటి సందర్భాలలో అపవిత్రతకు గురికాకుండా ఉండటానికి తులసికోటను ఇంటి వెనుకవైపు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.. వెనుకవైపు అయితే, పూజలు చేసే కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడికి వెళ్తారని, తులసిని శుభ్రంగా, పవిత్రంగా ఉంచడానికి వీలు కలుగుతుందని పేర్కొంటున్నారు.

కాబట్టి, తులసి మొక్కను ఎటువైపు ఉంచాలనేది మనకు అనుకూలమైన, తులసికి అపవిత్రత కలగని, స్వచ్ఛమైన గాలి ఇంటిలోకి వచ్చే విధంగా ఉండాలి. తులసిని కేవలం అలంకరణ వస్తువుగా కాకుండా, భక్తిభావంతో, పవిత్రతతో పూజించడం ముఖ్యం..

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us