AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏసీ కూలింగ్ ఎక్కట్లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. దాన్ని ఓపెన్ చేయగా బిత్తరపోయారు..

ఏసీ ఆన్ చేసినా గది చల్లబడటం లేదా? గ్యాస్ ఫుల్‌గా ఉన్నా కూలింగ్ రావడం లేదా? అయితే సమస్య కంప్రెషర్‌లో కాకుండా చిన్న కెపాసిటర్‌లో ఉండవచ్చు. అవుట్‌డోర్ యూనిట్ ఫ్యాన్ రివర్స్‌లో తిరగడం వల్ల ఏసీ సామర్థ్యం ఎలా తగ్గిపోతుందో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Video: ఏసీ కూలింగ్ ఎక్కట్లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. దాన్ని ఓపెన్ చేయగా బిత్తరపోయారు..
Telangana
Ravi Kiran
|

Updated on: May 02, 2026 | 1:25 PM

Share

ఓ ఇంట్లో ఏసీ ఆన్ చేసినా కూలింగ్ రావట్లేదు.. ఏమై ఉంటుందా అని ఆ కుటుంబం కంగారు పడింది. ఏసీ రిమోట్‌లో అన్ని బటన్లు నొక్కింది. అలాగే కిటీకీలు, తలుపులు గట్టిగా వేశామో.. లేదో.. చెక్ చేసుకున్నారు. అయినా ఏసీ కూలింగ్ రావట్లేదు. లాభం లేక ఇక టెక్నినిషియన్‌ను పిలిపించగా.. ఏసీ విప్పి చూడగా.. అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.! వేసవిలో ఏసీ కూలింగ్ తగ్గగానే మనం వెంటనే గ్యాస్ అయిపోయిందేమో అని కంగారు పడతాం. కానీ, కొన్నిసార్లు సమస్య మన కంటికి కనిపించేంత చిన్నదిగా ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సాంకేతిక సమస్య ఏసీ మెకానిజంపై అవగాహన పెంచేలా ఉంది.

సాధారణంగా ఏసీలో గ్యాస్ స్థాయిలు సరిగ్గా ఉండి, పైపులు చల్లగా ఉన్నా కూలింగ్ రావడం లేదంటే టెక్నీషియన్లు తలలు పట్టుకుంటారు. ఒక సందర్భంలో అవుట్‌డోర్ యూనిట్ నుండి వేడి గాలి రావాల్సిన చోట, గాలి లోపలికి లాగబడుతున్నట్లు గుర్తించారు. దీనికి కారణం ఏంటని వెతికితే అసలు విషయం బయటపడింది. ఆ ఏసీలోని అవుట్‌డోర్ యూనిట్ ఫ్యాన్ యాంటీ-క్లాక్‌వైజ్ దిశలో తిరగాల్సింది పోయి, క్లాక్‌వైజ్ అంటే రివర్స్‌లో తిరుగుతోంది. ఇలా ఫ్యాన్ రివర్స్‌లో తిరగడం వల్ల కండెన్సర్ కాయిల్ నుండి వేడి గాలి బయటకు వెళ్లకుండా, తిరిగి లోపలికే వస్తుంది. దీనివల్ల కాయిల్ విపరీతంగా వేడెక్కి, ఏసీ తన కూలింగ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే మిషన్ నడుస్తున్నా, గది మాత్రం చల్లబడదు. ఈ సమస్యకు మూలకారణం ఫ్యాన్ కెపాసిటర్ పాడవ్వడమేనని చెప్పొచ్చు. మోటార్ ఏ దిశలో తిరగాలనేది ఈ కెపాసిటర్ నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే పాత కెపాసిటర్‌ను తీసేసి కొత్తది వేస్తామో.. మళ్లీ ఏసీ మునుపటిలా అదిరిపోయే కూలింగ్ ఇస్తుంది.

Also Read: కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది

Follow Us
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..
రేపు ఏపీలో ఈ స్కూళ్లకు సెలవ్.. ఎందుకో తెల్సా?
రేపు ఏపీలో ఈ స్కూళ్లకు సెలవ్.. ఎందుకో తెల్సా?
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..