వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం

కొవిడ్‌ కొత్త మార్గదర్శకాలు వచ్చాకే చిన్నారులకు,  వయోవృద్ధులు తిరుమల వెంకన్న దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం 'డయల్‌ యువర్‌ తితిదే ఈవో' కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు  ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం
Follow us

|

Updated on: Nov 09, 2020 | 5:42 PM

కొవిడ్‌ కొత్త మార్గదర్శకాలు వచ్చాకే చిన్నారులకు,  వయోవృద్ధులు తిరుమల వెంకన్న దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం ‘డయల్‌ యువర్‌ తితిదే ఈవో’ కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు  ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో టీటీడీ  రద్దు చేసిన ఆర్జిత సేవల టికెట్ల రీఫండ్‌ను డిసెంబరు నెలాఖరు లోపు భక్తులు పొందవచ్చని వెల్లడించారు. 200 మంది లోపు ఆహ్వానితులతో తిరుమలలో పెళ్లిళ్లు  జరిపేందుకు అనుమతులు ఇస్తున్నామన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించామని చెప్పారు. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల త‌ర‌హాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల‌ను ఏకాంతంగా నిర్వహిస్తామని వివరించారు.

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసంలో సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు.  భ‌క్తుల ర‌ద్దీని బ‌ట్టి వార‌పు రోజుల్లో 7 వేల టోకెన్లు, వారాంతంలో మ‌రిన్ని అద‌న‌పు టోకెన్లు ఇస్తున్నామన్నారు. సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్ల వద్ద భక్తులు విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవడం లాంటి కోవిడ్‌-19 నిబంధనల‌ను పాటించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీల‌ను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమేజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లోనూ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. తిరుమల‌, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాల‌లు, విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాలు, టిటిడి అనుబంధ ఆల‌యాల్లో వీటిని అందుబాటులో ఉంచామని తెలియజేశారు.

Also Read :

కృష్ణా జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

మారేడిమిల్లి చేరుకున్న బన్నీ, రేపట్నుంచి షూటింగ్ షురూ

ఫేస్‌బుక్‌ పరిచయం..రూ.20 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో