హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై టీటీడీ సమీక్ష
TTD Chairman YV Subba Reddy Review : హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ధర్మ ప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని టీటీడీ చైర్మన్ వైవీ […]
TTD Chairman YV Subba Reddy Review : హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ధర్మ ప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఏఈవో ఏవీ ధర్మారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారద పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.