తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్ట్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పులు..

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్ట్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పులు..
Follow us

|

Updated on: Dec 20, 2020 | 5:45 AM

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్‌లు కూడా రద్దు చేస్తున్నట్టు CS సోమేష్‌ కుమార్ కార్యాలయం తెలిపింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకుని ఉంటే.. వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.

హైకోర్ట్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసింది సర్కార్‌. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం..దీంతో స్లాట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు శనివారమే ఉన్నతాధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ భావించినా అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆదివారం జరిగే భేటీ అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి.శేషాద్రి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అంతర్గత సర్క్యులర్‌ జారీ చేశారు. స్లాట్‌ బుకింగ్‌తో అవసరం లేకుండా, ఆధార్‌ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.