హద్దులు మీరనంటున్న అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌.. వరుసగా గ్లామర్ పాత్రలు రావడంతో..

గ్లామర్ పాత్రలు చేసినా తన కంటు కొన్ని హద్దులు ఉన్నాయని చెబుతోంది అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’

  • Publish Date - 5:40 am, Sun, 20 December 20
హద్దులు మీరనంటున్న అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌.. వరుసగా గ్లామర్ పాత్రలు రావడంతో..

గ్లామర్ పాత్రలు చేసినా తన కంటు కొన్ని హద్దులు ఉన్నాయని చెబుతోంది అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది. తన నటన, అంద చందాలతో యువతను పిచ్చెక్కిస్తోంది. ఫలితంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

తన తొలిచిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదల తరువాత అందరూ తనను ఓ రాణిలా చూశారని ఆ తర్వాత ‘వెంకీ మామ’ విజయంతో తనపట్ల అభిమానం రెట్టింపైందని చెప్పుకొచ్చింది పాయల్‌. అయితే గ్లామర్ పాత్రలు మాత్రమే ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పింది. తనకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది కానీ తనకు వచ్చిన పాత్రలు చేస్తూ వస్తున్నానని, గ్లామర్‌ పాత్రలు పోషించినా ఎప్పుడూ తాను హద్దులు దాటనని తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని తెలిపింది. తన కెరీర్‌ ప్రారంభ దశలోనే ఉంది కనుక భవిష్యత్‌లో తప్పకుండా అన్ని జోనర్‌ సినిమాలు, అని రకాల పాత్రలను పోషిస్తానని అభిమానులకు తీపి కబురు చెప్పింది ఈ అమ్మడు.