వారు.. ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు ఫీజు కట్టాల్సిందే..

| Edited By:

Jul 10, 2020 | 6:28 AM

కోవిద్-19 వ్యాప్తి నేపథ్యంలో చాలా పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన ఇంటర్‌ సెకండియర్

వారు.. ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు ఫీజు కట్టాల్సిందే..
Follow us on

TS EAMCET: కోవిద్-19 వ్యాప్తి నేపథ్యంలో చాలా పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించామని సంతోషిస్తూ… మరోవైపు ఎంసెట్‌ పరీక్ష ఫీజు చూసి ఆందోళన చెందుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ దరఖాస్తుకు రూ.10వేల ఆలస్య రుసుముతో ఈనెల 15వరకు పొడిగించారు. పాస్ అయిన ఇంటర్‌ విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంకా 6 గడువు రోజులు ఉన్నప్పటికీ.. ఆలస్య రుసుం రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..