సాగు కరెంటుకు మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తాం : సీఎం కేసీఆర్

రైతులు పండించే పంటల సాగు ఉచిత కరెంటుకు మీటర్లు బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర తెచ్చిన కొత్త విద్యుత్ చ‌ట్టాన్ని తాము పార్లమెంట్‌లో గట్టిగా వ్యతిరేకిస్తామ‌ని ఆయన అసెంబ్లీ సాక్షిగా..

సాగు కరెంటుకు మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తాం : సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Sep 15, 2020 | 2:36 PM

రైతులు పండించే పంటల సాగు ఉచిత కరెంటుకు మీటర్లు బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర తెచ్చిన కొత్త విద్యుత్ చ‌ట్టాన్ని తాము పార్లమెంట్‌లో గట్టిగా వ్యతిరేకిస్తామ‌ని ఆయన అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఈ చట్టం చాలా ప్రమాద‌క‌ర‌మ‌ని.. ఈ బిల్లును పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో స్వల్పకాలిక చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది.. కానీ చెన్నైలో తాగునీటికి అనేక స‌మ‌స్యలున్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజ‌ల ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చాల‌నే చిత్తశుద్ధి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఇవాళ్టికీ లేకుండా పోయిందని కేసీఆర్ అన్నారు. దేశంలో 40 కోట్ల ఎక‌రాల భూమి సాగులో ఉందన్న కేసీఆర్.. పుష్కలంగా స‌రిపోయే నీరు ఉన్నా.. సాగుకు ఇవ్వలేని పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయని విమర్శించారు. దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్షల మెగావాట్ల పైనే ఉందని.. ఇప్పటి వ‌ర‌కు 2 ల‌క్షల 16 వేల మెగావాట్లు మాత్రమే దేశంలో వాడారని కేసీఆర్ తెలిపారు. దేశ ప్రగ‌తి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాల‌నే ఆలోచ‌న ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీలకు లేకుండాపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.