కరోనా విషయంలో చైనాపై మళ్లీ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

చైనా వల్లే ప్రపంచమంతా సర్వనాశనమైందని.. తమ దేశ పౌరులు అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం ఇంకా చల్లారడం లేదు. కరోనాను ఆయన చైనా..

కరోనా విషయంలో చైనాపై మళ్లీ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Sep 02, 2020 | 7:39 PM

చైనా వల్లే ప్రపంచమంతా సర్వనాశనమైందని.. తమ దేశ పౌరులు అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం ఇంకా చల్లారడం లేదు. కరోనాను ఆయన చైనా వైరస్ గానే ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉంటారు. తాజాగా ట్రంప్ చైనా మీద మరో హాట్ కామెంట్ చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక కరోనా మరణాలు చైనాలోనే సంభవించాయన్నారు. కరోనా చావుల లెక్కలను చైనా దాచిపెడుతోందని.. ఎప్పటి నుంచో విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. వూహాన్‌ లో పుట్టిన ఈ వైరస్ చైనా లోని మిగతా ప్రాంతాలకు దాదాపు తాకలేదనే చైనా చెప్పుకొస్తోంది. చైనా చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగా లక్షల్లో కోవిడ్ మరణాలు ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 26 మిలియన్లకు చేరువ కాగా.. 8.6 లక్షల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. అమెరికాలో అత్యధికంగా 6 మిలియన్ల మందికిపైగా ఈ వైరస్ బారిన పడగా.. 1.89 లక్షల మంది చనిపోయారు. కానీ వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం ఇప్పటి వరకూ 85 వేల మంది మాత్రమే వైరస్ బారిన పడగా.. 4634 మంది చనిపోయారని ఆ దేశం ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న అంశమైంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో