GHMC Election Results 2020 : గ్రేటర్‌ పీఠంపై మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనా.! బల్దియాపై కారు షికారు నల్లేరుపై నడకేనా.!

గ్రేటర్‌ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తాం! ఇది టీఆర్‌ఎస్‌ ధీమా!. గ్రేటర్‌ మేయర్‌ పీఠం మళ్లీ తమకే దక్కుతుందని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి నుంచి..

GHMC Election Results 2020 : గ్రేటర్‌ పీఠంపై మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనా.! బల్దియాపై కారు షికారు నల్లేరుపై నడకేనా.!
Follow us
Venkata Narayana

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2020 | 6:18 AM

గ్రేటర్‌ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తాం! ఇది టీఆర్‌ఎస్‌ ధీమా!. గ్రేటర్‌ మేయర్‌ పీఠం మళ్లీ తమకే దక్కుతుందని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది.. లాస్ట్‌ టైమ్‌ ఒక్క సీట్‌తో మిస్సయ్యింది కానీ ఈసారి మాత్రం సెంచరీ కొట్టడం గ్యారంటీ అని కాన్ఫిడెన్స్‌గా అంటోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే, తక్కువ సంఖ్యలో కార్పొరేటర్లను గెలుచుకున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ మేయర్‌ పగ్గాలు చేపడుతుందా ? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఆ పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో ఓట్లే మేయర్‌ పీఠం దక్కేలా చేస్తాయని పేర్కొంటున్నారు. టిఆర్‌ఎస్‌ కేవలం 41 డివిజన్లలో గెలిచినప్పటికీ పరోక్ష పద్ధతిలో మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటుందని అంటున్నారు. అన్నీ సర్దుకుని ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే.. టిఆర్‌ఎస్‌ కు ఎదురే ఉండదని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జిహెచ్‌ఎంసి పరిధిలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు ఉంది. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఓటుపై మాత్రమే కొన్ని అనుమానాలున్నాయి. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిహెచ్‌ఎంసి లో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్‌ పదవికి మేజిక్‌ ఫిగర్‌ 76 సీట్లు. అయితే మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ కు 35 ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 41 మంది కార్పొరేటర్లు గెలిస్తే మేజిక్‌ ఫిగర్‌ 76 కు చేరుకుంటుంది. అంటే టిఆర్‌ఎస్‌ నుంచి కేవలం 41 మంది కార్పొరేటర్లు గెలిచినా మేయర్‌ పదవి దక్కుతుంది. అన్నీ సర్దుకుని ఎంఐఎం కూడా కలిసి వస్తే… బల్దియాపై గులాబీ జెండా ఎగరడం నల్లేరుపై నడకే అవుతుంది.