AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ కాంగీలకు బాల్కా సుమన్ చురకలు

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఖండించారు. అసెంబ్లీలో పార్టీల బలం బట్టి సమయం కేటాయిస్తారన్నది టీ కాంగీలకు తెలియదా..

టీ కాంగీలకు బాల్కా సుమన్ చురకలు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2020 | 9:04 PM

Share

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఖండించారు. అసెంబ్లీలో పార్టీల బలం బట్టి సమయం కేటాయిస్తారన్నది టీ కాంగీలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్పీకర్‌ను సైతం అవమాన పరిచే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడారని విమర్శించారు. ఏ అంశంపై అయినా శాసనసభలో చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని.. అయినా ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్‌ చిల్లర ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పీవీకి భారతరత్న రావడం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. పీవీ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్న విషయాన్ని అందరూ అభినందించాలని ఆయన అన్నారు.