గుడ్ న్యూస్: ఆ మూడు ఔషధాలతో.. కరోనా ఖతం..

గుడ్ న్యూస్: ఆ మూడు ఔషధాలతో.. కరోనా ఖతం..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొవిద్ రోగులకు మూడు వేర్వేరు యాంటీవైరల్‌ ఔషధాల కలయికతో చేసిన చికిత్స మెరుగైన ఫలితాలు ఇచ్చిందని హాంకాంగ్

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 12:24 PM

Triple anti-viral drug: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొవిద్ రోగులకు మూడు వేర్వేరు యాంటీవైరల్‌ ఔషధాల కలయికతో చేసిన చికిత్స మెరుగైన ఫలితాలు ఇచ్చిందని హాంకాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరి అధ్యయనం లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే ‘లోపినావిర్‌-రిటోనావిర్‌’, నోటి హైపటైటిస్‌ సి ఔషధమైన ‘రైబవిరన్‌’, కండరాల బలహీనత చికిత్స కోసం అభివృద్ధి చేసిన ‘ఇంటర్‌ఫెరాన్‌ బీటా 1బి’లను కాంబోగా చేశారు.

మరోవైపు.. హాంకాంగ్‌లోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 127 మంది కొవిద్ రోగులకు ఈ ఔషధాలను విడతల వారీగా ఇచ్చారు. చికిత్స ప్రారంభించిన ఏడు రోజుల్లోనే వారి నాసికా రంధ్రాల్లో వైరస్‌ జాడ లేకుండా పోయింది. రెండు వారాల తర్వాత ఆరోగ్యం మెరుగైందని తెలిపారు. ‘వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభమైనప్పుడే రోగి శరీరంలో వైరస్‌ ఎక్కువగా ఉంటుంది.

కాగా.. వెంటనే ఆస్పత్రిలో చేరే వారికి ఒకే ఔషధంతో చికిత్స చేయడం కంటే, బహుళ ఔషధాలతో చికిత్స చేయడం ఎక్కువ ఫలితమిస్తుందని గతంలో ఇన్‌ఫ్లూయంజా విషయంలోనూ రుజువైంది. మెర్స్‌ కరోనా వైరస్‌, సార్స్‌ వెలుగుచూసిన తొలినాళ్లలోనూ ఇలాగే చేసి శ్వాసకోస వైఫల్యాలు అరికట్టి మరణాలను తగ్గించారు. అయితే ఈ ఫలితాలన్నీ తేలికపాటి అనారోగ్యంతో ఉన్న రోగుల్లోనే గమనించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిలో ఈ కాంబో ఔషధ ప్రయోగ ఫలితాలు చూడాలంటే ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం’ అని పరిశోధకులు పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu