AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ టూత్ పేస్ట్‌లో ట్రైక్లోసన్ ఉందా.? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాదమే.!! సంచలన నిజాలు వెల్లడి.!

మనం నిత్యం వాడే వస్తువులే మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ఉదయం లేవగానే వాడే టూత్‌ పేస్ట్‌ మొదలుకొని, బాత్‌ సోప్‌ వరకు..

మీ టూత్ పేస్ట్‌లో ట్రైక్లోసన్ ఉందా.? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాదమే.!! సంచలన నిజాలు వెల్లడి.!
Ravi Kiran
|

Updated on: Dec 19, 2020 | 3:38 PM

Share

Tooth Paste With Triclosan: మనం నిత్యం వాడే వస్తువులే మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ఉదయం లేవగానే వాడే టూత్‌ పేస్ట్‌ మొదలుకొని, బాత్‌ సోప్‌ వరకు అన్నీ ప్రమాదకరంగా మారుతున్నాయి. అప్పుడప్పుడు కంపెనీలు.. తాము తయారు చేసే ఉత్పత్తుల జీవితకాలాన్ని పెంచేందుకు పలు ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తుంటారు. అవే ఇప్పుడు మనకు అనారోగ్యం తెప్పిస్తున్నాయి. అందులో ఒకటే ట్రైక్లోసన్‌. దీన్ని టూత్‌పేస్ట్‌లు, బాత్‌ సోప్‌లు, హ్యాండ్‌ వాష్‌ల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ‌తాజాగా ట్రైక్లోసన్‌పై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం పలు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మన శరీరంలోని నరాల వ్యవస్థను ట్రైక్లోసన్ నిర్వీర్యం చేస్తుందని తేలింది.

ప్రపంచ దేశాలు ట్రైక్లోసన్‌ వినియోగంతో వచ్చే అనర్థాలను ఎప్పుడో గుర్తించాయి. అందుకే చాలా దేశాల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. వాస్తవానికి 1960లోనే ఔషధ ఉత్పత్తులకు మాత్రమే ట్రైక్లోసన్‌ను పరిమితం చేశారు. కొన్ని దేశాల్లో పరిమిత మోతాదులోనే వాడాలని నిబంధనలు ఉన్నాయి. కానీ అనుమతించిన పరిమితి 500 వంతు కన్నా తక్కువగా ఉన్నా నాడీ వ్యవస్థలోని కణాలను దెబ్బ తీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సబ్బులు, టూత్‌పేస్ట్‌లే కాకుండా నిత్యం మనం వినియోగించే చాలా వస్తువుల్లో ట్రైక్లోసన్‌ను ‌ వినియోగిస్తున్నారు. ట్రైక్లోసన్‌ తక్కువ పరిమాణంలో వినియోగించినప్పుడు శరీరం అప్పటికప్పుడు తట్టుకోగలిగినా.. దీర్ఘకాలంలో మాత్రం దుష్ప్రభావాలు తప్పవు.

అలాగే ఎఫ్‌డీఏ కూడా ట్రైక్లోసన్‌ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించిందంటే అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్లపై సుదీర్ఘ కాలంలో ప్రభావం పడినా.. చిన్న పిల్లల్లో మాత్రం తక్కువ సమయంలోనే ఆ ఎఫెక్ట్‌ చూపిస్తుంది. ఈ ప్రభావం నుంచి బయటపడి కోలుకోవడం అంత సులభం కాదు. మనం మేల్కొనేలోపే ట్రైక్లోసన్‌ శరీరంలో చాలా వ్యవస్థలను నాశనం చేస్తుంది. ట్రైక్లోసన్‌తో వచ్చే దుష్ప్రభావాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు అవగాహన ఉన్నా… దీని వినియోగాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. తమ ప్రోడక్ట్‌ ఎక్కువ రోజులు ఉండేందుకు ఆయా కంపెనీలు ట్రైక్లోసన్‌ను వాడుతున్నాయే కానీ.. దానివల్ల వచ్చే అనర్ధాల సంగతి మాత్రం పట్టించుకోవడం లేదు.