గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. సంక్రాంతి సందర్భంగా ఎన్ని బస్సులు నడుపుతున్నారంటే…

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు.

  • Sanjay Kasula
  • Publish Date - 3:41 pm, Sat, 19 December 20
గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. సంక్రాంతి సందర్భంగా ఎన్ని బస్సులు నడుపుతున్నారంటే...

Sankranti Special Buses : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు వచ్చేవారి కోసం.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు. ఏపీ 2021 జనవరి 8 నుంచి 13 వరకు ఏపీకి 3607 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా…తెలంగాణ నుంచి 1251 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాకుండా..ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201 బస్సులు.. విశాఖకు 551 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో వివిధ జిల్లా మధ్య 1038 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాని అన్నారు. పండగ సమయంలో తిరుగు ప్రయాణంలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు నడపనున్నారు.

ఆర్టీసీలో ప్రయాణించి భద్రంగా, సురక్షితంగా ప్రయాణికులు తమ తమ ఇళ్లకు చేరుకుని, సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.