టాప్ 10 న్యూస్ @ 6PM

1.ఏపీ జగన్‌దే…వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుంది.  ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి..Read More 2.మోదీ చెంప అలా పగలగొడతా..! ధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకూ చేరుతోన్నాయి. బెంగాల్‌లో మమతా ప్రభుత్వం వసూళ్ల […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Ram Naramaneni

|

May 08, 2019 | 5:53 PM

1.ఏపీ జగన్‌దే…వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం

ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుంది.  ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి..Read More

2.మోదీ చెంప అలా పగలగొడతా..!

ధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకూ చేరుతోన్నాయి. బెంగాల్‌లో మమతా ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు..Read More 

3.రాజీవ్‌ని అంత మాటంటారా?… రక్తంతో ఈసీకి అమేథీ యువకుని లేఖ

న్నికల సంఘానికి అమేథీ నుంచి లేఖ అందింది. దాన్ని తెరిచి చూస్తే లోపల ఎరుపు రంగు అక్షరాలున్నాయి. ఏంటా అని పరీక్షించి చూడగా అది రక్తంతో రాసిన లేఖ అని తెలిసింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు షాక్ తిన్నారు..Read More 

4.ఆడ నీవు..ఈడ నేను! టూర్లలో ‘చంద్రులు’ బిజీ బిజీ

దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటనలపైనే దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలు, నేతల భేటీలతో బిజీగా ఉన్నారు.. Read More 

5.ఏపీపై ఉగ్ర పంజా..? బీ అలెర్ట్..

ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రవాదులు టార్గెట్ చేశారా..? విధ్వంసాలకు భారీగా కుట్రలు పన్నారా..? తీర ప్రాంతాల గుండా తీవ్రవాదులు చొరబడేందుకు వ్యూహాలు రచించారా..? అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు..Read More  

6.’మహర్షి’ కోసం టికెట్ల రేట్లు పెంచలేదు: తలసాని

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మహర్షి కోసం టికెట్ల రేట్లు పెరిగాయన్న వార్త ప్రస్తుతం దుమారం రేపుతోంది. అయితే.. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం క్లారిటీ ఇచ్చారు..Read More 

7.నీ టైం వేస్ట్ చేసుకోకమ్మా: ప్రియాంకకు కేజ్రీవాల్ సలహా

ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో ప్రచారం చేస్తూ బిజీగా గడుపుతోన్న ప్రియాంక గాంధీ తన సొంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రియాంక రోడ్‌ షో‌కు సిద్ధమైన నేపధ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు..Read More 

8.‘మహర్షి’ ఎఫెక్ట్: దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు

మహేశ్ బాబు తాజా సినిమా ‘మహర్షి’కి సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్‌ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీసులో వారు కీలక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు..Read More 

9.రెండేళ్ల తరువాతే ‘అవతార్ 2’

అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పిల్లలు, పెద్దలందరినీ ఆకట్టుకున్న ‘అవతార్’ మూవీ సీక్వెల్ రానుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ మూవీ సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాడు డైరక్టర్ జేమ్స్ కామెరూన్. అయితే ఇప్పుడప్పుడే కాదండోయ్..Read More  

10.త్వరలో ఏపీ మంత్రి రాజీనామా! కారణమేంటంటే?

త్వరలో ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నారు. ఐతే దీని వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. సాంకేతిక కారణాలతోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..Read More 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu