“టమాటా’ సందడితో “ఉల్లి ఘాటు’ రేపుతుంది..

టమాట వంటింట్లో సందడి చేస్తుంటే…ఉల్లి ఘాటు మాత్రం నసాళానికి ఎక్కుతోంది. ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే…టమాటా ధరలు మాత్రం రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దెబ్బతింది. దీంతో ఉల్లి రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో ఉల్లి 35 రూపాయలు పలుకుతుంటే..అదే రిటైల్‌ మార్కెట్లో మాత్రం 45 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఉల్లి దిగుబడులు ఒక్కసారిగా తగ్గిపోవడంతో…ధరలు […]

  • Anil kumar poka
  • Publish Date - 1:57 pm, Wed, 28 August 19
"టమాటా' సందడితో "ఉల్లి ఘాటు' రేపుతుంది..

టమాట వంటింట్లో సందడి చేస్తుంటే…ఉల్లి ఘాటు మాత్రం నసాళానికి ఎక్కుతోంది. ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే…టమాటా ధరలు మాత్రం రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దెబ్బతింది. దీంతో ఉల్లి రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో ఉల్లి 35 రూపాయలు పలుకుతుంటే..అదే రిటైల్‌ మార్కెట్లో మాత్రం 45 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఉల్లి దిగుబడులు ఒక్కసారిగా తగ్గిపోవడంతో…ధరలు అమాంతం పెరిగాయి.

ఉల్లి ఓవైపు ఘాటెక్కిస్తుంటే…టమాటా మాత్రం వంటింట్లో సందడి చేస్తోంది. టమాట ధరలు అమాంతం పడిపోవడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ టమాట రైతుల పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పండిస్తే..తీరా మార్కెట్‌కు వస్తే ధరలు అమాంతం పడిపోవడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలకు 20 నుంచి 30 వేలు ఖర్చుపెట్టి పంట పండిస్తే…మార్కెట్‌ మాయాజాలంతో రైతు కుదేలవుతున్నాడు.

టమాటాకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మదనపల్లి మార్కెట్లో కిలో టమాట ధర 5 రూపాయలకి పడిపోవడంతో టమాట రైతులు లబోదిబోమంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా అధికంగా దిగుబడి కావడంతో కొనుగోలుకు బయ్యర్లు ముందకు రావడంలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ట్రేడర్లు లేకపోవడంతో తక్కువ ధరకే టమాటాను రైతులు వ్యాపారస్తులకు అమ్మేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధరలు లేకపోవడంతో తామెట్లా బతికేది అని రైతులు ప్రశ్నిస్తున్నారు.