టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహం మరికొద్ది గంటల్లోనే జరగనుంది. తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. రామానాయుడి స్టూడియోలో బయో సెక్సూర్ వాతావరణంలో రానా, మిహికాల పెళ్లి వేడుక జరగబోతుంది. ఈ సందర్భంగా రానా షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్‌లను బాగా ఆకట్టుకుంటోంది. ”వరుడిగా మారిన రానా తన తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. పెళ్లి రెడీ అని కామెంట్ పెట్టాడు. ఒకే ఫ్రేంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు వీరు”. కాగా ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, వేడుకకి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇప్పటికే మిహీకా ఇంట్లో హల్దీ సెర్మనీ నిర్వహించగా, ఆ వేడుకలో ఎల్లో, గ్రీన్ లెహంగాలో మెరిసింది మిహీకా. ఇక మెహిందీ ఫంక్షన్‌లో కూడా లేత గులాబీ వర్ణం జాకెట్ లెహెంగాలో ట్రెండీ జ్యువెలరీలో మిహీకా కనిపించింది. మిహీకాతో పాటు రానా, సమంతకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో హల్‌చల్ అయ్యాయి.
Ready!!! ??? pic.twitter.com/Njcl4yvFnK
— Rana Daggubati (@RanaDaggubati) August 8, 2020
#WeddingVibes ❤️ pic.twitter.com/q3JuFHXVyQ
— Suresh Productions (@SureshProdns) August 7, 2020
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య
48 గంటలు అన్నీ బంద్.. పుట్టపర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్