AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో గౌడ్ అన్న.. తాటి చెట్టు నుంచే కాటికి పయనమయ్యావా..?

రోజూ కుటుంబాన్ని పోషించేందుకు తాటిచెట్టు ఎక్కే గీత కార్మికుడు… అదే చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాయిలి కిషన్, కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో స్పృహ కోల్పోయి చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ మృతి చెందాడు.

Telangana: అయ్యో గౌడ్ అన్న.. తాటి చెట్టు నుంచే కాటికి పయనమయ్యావా..?
Saayili Kishan
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 7:47 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు సాయిలి కిషన్ ప్రతిరోజులాగే కల్లు గీసేందుకు తాటిచెట్టుపైకి ఎక్కాడు. ఇన్నాళ్లు తమ పొట్ట కూటికి సాయంగా నిలిచిన తాటి చెట్టుపైనే.. అతను కన్ను మూస్తాడని ఊహించి ఉండడు. ఎత్తైన తాటి చెట్టుపై కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. స్పృహ కోల్పోయిన కిషన్ చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు గమనించేలోపే జీవితం ఆగిపోయింది. చెట్టుపైన వేలాడుతున్న అతని దేహాన్ని చూసి గ్రామం మొత్తం షాక్‌కు గురైంది. వార్త తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆ దృశ్యం చూసి బోరున విలపించారు. ఉదయం మాట్లాడిన మనిషి.. కాసేపట్లో మృతదేహంగా కనిపించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

రోజూ ప్రాణాలను పణంగా పెట్టి చెట్టెక్కే అతని చేతులు ఇప్పుడు కదలకుండా నిశ్శబ్దంగా వేలాడుతూ కనిపించాయి. కుటుంబాన్ని పోషించేందుకు తాళ్లు ఎక్కిన కిషన్.. అదే తాటిచెట్టుపై చివరి శ్వాస విడవడంతో.. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పేదరికం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే గీత కార్మికుల బాధను మరోసారి ఈ సంఘటన గుర్తు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బందితో కలిసి కిందకు దింపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?