నెల్లూరులో టెన్షన్ టెన్షన్.. టీడీపీ యువనేతపై దాడి

నెల్లూరు : టీఎన్‌ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి దిగారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మస్తాన్‌రావు కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తిరుమలనాయుడు నెల్లూరు రూరల్ ఎన్నికల్లో టీడీపీ తరపున క్రియాశీలకంగా పనిచేశాడు. వైసీపీ కార్యకర్తలే తిరుమలనాయుడుపై దాడిచేశారని ఆరోపిస్తూ.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు […]

నెల్లూరులో టెన్షన్ టెన్షన్..  టీడీపీ యువనేతపై దాడి
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2019 | 7:52 PM

నెల్లూరు : టీఎన్‌ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి దిగారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మస్తాన్‌రావు కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తిరుమలనాయుడు నెల్లూరు రూరల్ ఎన్నికల్లో టీడీపీ తరపున క్రియాశీలకంగా పనిచేశాడు. వైసీపీ కార్యకర్తలే తిరుమలనాయుడుపై దాడిచేశారని ఆరోపిస్తూ.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కార్యాలయంపై ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. కాగా, తిరుమలనాయుడుపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.