“టైటానిక్” కథ ముగియనుందా.. అసలేం జరుగుతోంది..?

“టైటానిక్” ఈ పేరు తెలియని వారుండరు. హాలీవుడ్ ఫేమస్ ప్రేమ కథా చిత్రం టైటానిక్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ ఫిప్ సముద్రంలో ఎలా మునిగిపోయిందో చెబుతూ ఈ ప్రేమ కథా చిత్రం సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన విషాద గాధ. తరాలు మారినా ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో […]

టైటానిక్ కథ ముగియనుందా.. అసలేం జరుగుతోంది..?
Titanic
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 8:11 PM

“టైటానిక్” ఈ పేరు తెలియని వారుండరు. హాలీవుడ్ ఫేమస్ ప్రేమ కథా చిత్రం టైటానిక్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ ఫిప్ సముద్రంలో ఎలా మునిగిపోయిందో చెబుతూ ఈ ప్రేమ కథా చిత్రం సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన విషాద గాధ. తరాలు మారినా ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన టైటానిక్ షిప్.. గమ్యస్థానం చేరకుండానే కెనాడాకు 387 మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ షిప్ మునిగిపోవడం వెనుక ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నో కథనాలు, నవలలు, సినిమాలు వచ్చాయి. అయితే ఇన్ని సంవత్సరాలు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలోని ఉప్పు నీటి కొత వల్ల టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలు దెబ్బతింటున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాగే ఉంటే మరో ముప్పై ఏళ్లలో టైటానిక్ ఆనవాళ్లు కనుమరుగవుతాయని అంటున్నారు.