AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో రూ.3222 కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన

తిరుపతిలో పలు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో రూ. 3222 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్, గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

తిరుపతిలో రూ.3222 కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Tirupati News
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2026 | 6:13 PM

Share
తిరుమల కొండపై రద్దీ తగ్గించేందుకు తిరుపతిలో వసతి సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తుడా పరిధిలో జరగనున్న ఈ అభివృద్ధి పనులకు.. అమరావతి నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. ఇంటిగ్రేటెడ్‌ పిలిగ్రిమ్‌ టౌన్‌షిప్‌, టీటీడీ ఉద్యోగుల నివాస లే అవుట్‌ అభివృద్ధి, 9 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
అలిపిరి దగ్గర రూ.1332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో 2700 గదులతో వసతి సముదాయాలను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు 15,000ల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. రూ.160 కోట్లతో ఒకేసారి ఆరు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రాన్ని, రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో ఒకేసారి 16వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం ఉంటుంది.
అదేవిధంగా రూ.311 కోట్లతో 4500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మించనున్నారు. పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌, డిజిటల్ సమాచార కేంద్రం, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.  తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి మూడు మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
 ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ రెండేళ్లలో పూర్తి చేయాలన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న సీఎం.. టీటీడీ ఉద్యోగులు, సేవలకు సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Follow Us
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు