ఢిల్లీలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.