అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీవారు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతన్నాయయి. శనివారం రాత్రి మలయప్ప స్వామికి అశ్వవాహన సేవ నిర్వహించారు.

అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీవారు
Follow us

|

Updated on: Sep 26, 2020 | 11:34 PM

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతన్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామికి అశ్వవాహన సేవ నిర్వహించారు. అలంకార భూషితుడైన దేవదేవుడు.. అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారంతో శ్రీవారి వాహన సేవలు ముగిశాయి.

బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై వెంకటేశ్వర్వర స్వామి దర్శనమిచ్చారు. ఎనిమిదో రోజున శ్రీవారికి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే రథోత్సవం ఆలయంలో నిర్వహించే వెసులుబాటు లేనందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న వేళ బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఉత్సవాల్లో ఆఖరి కార్యక్రమైన చక్రన్నాన కార్యక్రమానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Also Read :

సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు

ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు