తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఇవ్వనున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ప్రతి రోజూ 19 వేలు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారుల తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారమే భక్తులకు శ్రీ వారి దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆలయంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులు, ముందుగానే తిరుమలకు చేరుకుని, తమకు కేటాయించిన సమయంలో దర్శనం చేసుకోవాలని పేర్కొంది. వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలని, మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడవద్దని టీటీడీ సూచించింది.
కాగా భక్తులు అధిక సంఖ్యలో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించడంతో టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం లేదు. ఇప్పుడే కాదు ప్రతి నెలా టికెట్లు విడుదల చేసిన సమయంలో ఇలానే జరుగుతోందని వారు చెప్తున్నారు. దీనిపై టీటీడీ అధికారులకు సమాచారం చేరవేసినప్పటికీ, వారు సరైన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ind vs Aus : రెండో వన్డేలో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు