AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న పెద్దజీయర్‌స్వామి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కైంకర్యాల్లో కీలక పాత్ర పోషించే పెద్దజీయర్‌స్వామి కరోనాను జయించారు. చికిత్స అనంతరం ఆయన చెన్నై నుంచి తిరుపతిలోని జీయర్‌ మఠానికి చేరుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న పెద్దజీయర్‌స్వామి
Balaraju Goud
|

Updated on: Aug 03, 2020 | 3:59 AM

Share

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కైంకర్యాల్లో కీలక పాత్ర పోషించే పెద్దజీయర్‌స్వామి కరోనాను జయించారు. చికిత్స అనంతరం ఆయన చెన్నై నుంచి తిరుపతిలోని జీయర్‌ మఠానికి చేరుకున్నారు. గత నెల 18న జీయర్‌స్వామికి కరోనా పాజిటివ్ గా తేలడంతో తిరుపతిలోని పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం తిరుపతిలోని జీయర్‌ మఠానికి పంపిన వైద్యులు హోం ఐసోలేషన్‌ చేశారు. అయితే, ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల సలహా మేరకు 22వ తేదీన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 11 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొద్ది రోజులు పెద్ద జీయర్ స్వామి మఠంలోనే హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు.

Follow Us