ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా…మనుషుల రక్తం మరిగింది ఈ మృగం

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా...మనుషుల రక్తం మరిగింది ఈ మృగం

పులి కదలికలతో నిన్న వరకు అక్కడి జనానికి భయం మాత్రమే ఉండేది. ఒక్కసారిగా పంజా విసరడంతో ఇప్పుడు అక్కడి జనాలకు గుండె ఆగిపోయేంత ఏర్పడింది.

Ram Naramaneni

|

Nov 12, 2020 | 9:34 PM

పులి కదలికలతో నిన్న వరకు అక్కడి జనానికి భయం మాత్రమే ఉండేది. ఒక్కసారిగా పంజా విసరడంతో ఇప్పుడు అక్కడి జనాలకు గుండె ఆగిపోయేంత ఏర్పడింది. టైగర్‌ జోన్‌లో ఉన్నామని తెలుసుకున్న ప్రజలకు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ధైర్యం నూరి పోస్తున్నారు. పులి కంట పడకుండా ఉండమని హెచ్చరిస్తున్నారు.ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి పేరు చెబితే అక్కడి జనం వణికిపోతున్నారు. ఓ యువకుడిని చంపేసింది. డెడ్‌బాడీని పక్కనే ఉన్న ఫారెస్ట్‌లోకి లాక్కెళ్లి పీక్కుతుంది. గమనించిన జనం గట్టిగా కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది. ఈఘటన దహేగాం మండలం దిగిడాలో జరిగింది. ఫ్రెండ్స్‌తో కలిసి చేపలు పట్టేందుకు వాగుకు వెళ్లాడు విఘ్నేష్. చేపలను ఒడ్డుకు తీసుకొస్తుండగా అతనిపై పులి దాడి చేసింది. తొడ భాగంపై పంజా విసి మాంసాన్ని పీక్కుతింది. టైగర్ అటాక్‌లో తీవ్రంగా గాయపడిన విఘ్నేష్ స్పాట్‌లో చనిపోయాడు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అడవిలో విఘ్నేష్ మృతదేహాన్ని గుర్తించారు. పులి జాడ కోసం వెదుకుతున్నారు. పాదముద్రల ఆధారంగా పెంచికల్ పేట అభయారణ్యంలోకి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు‌. రైతులు , పశువుల కాపర్లు అటవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చారు.ఎవరూ ఒంటరిగా తిరగవద్దంటున్నారు. విఘ్నేష్ పై పులి పంజా విసిరిన తీరు చూస్తుంటే ….మనిషి రక్తం రుచి మరిగిన పులి పనిగా భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.

సాధారంగా పశువులపై దాడి చేసే పులులు మనషి రక్తం రుచి మరిగితే పశువుల్ని సహించవు. తిరిగి మనిషి మాంసం కోసమే వెదుకుతుంది. ఆసిఫాబాద్‌కి సమీపంలోనే ఉన్న మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో కూడా రెండేళ్లలో 10మందిని ఓ పులి చంపుకొని తింది. చంద్రపూర్‌ జిల్లా రాజూర తాలూకాలో ఆరుగురిపై దాడి చేసింది. గత ఆగష్టు నెలలో రాజురా తాలుకా నవేగావ్‌కు చెందిన పశువుల కాపరి వాసుదేవ్‌ కాడేకర్‌ని పులే పొట్టనపెట్టుకుంది. ఈమధ్యనే ఆ పులిని పట్టుకున్నారు. అదే ఇప్పుడు తప్పించుకొని వచ్చి తెలంగాణలోకి అడుగుపెట్టిందేమోనన్న భయం కనిపిస్తోంది. మహారాష్ట్రలో మాయమైన పులి దహేగాంలో ప్రత్యక్ష మైందా అన్న అనుమానిస్తున్నారు అటవిశాఖ అధికారులు.

Also Read : Bigg Boss 4: సీక్రెట్‌ రూమ్‌కి అఖిల్‌.. అభికి అర్థం అయ్యిందా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu