‘జూ’ లో దారుణం.. ప్రేక్షకులు చూస్తుండగానే..

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో దారుణం చోటుచేసుకుంది. సరదాగా జంతువులను చూద్దామని జూకు వచ్చిన ప్రేక్షకులకు భయంకరమైన దృశ్యం కళ్లబడింది. వారంతా చూస్తుండగానే జూలోని పులి ఓ మహిళా ఉద్యోగిపై

  • Tv9 Telugu
  • Publish Date - 1:07 am, Mon, 6 July 20
'జూ' లో దారుణం.. ప్రేక్షకులు చూస్తుండగానే..

Tiger kills Zurich zookeeper: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో దారుణం చోటుచేసుకుంది. సరదాగా జంతువులను చూద్దామని జూకు వచ్చిన ప్రేక్షకులకు భయంకరమైన దృశ్యం కళ్లబడింది. వారంతా చూస్తుండగానే జూలోని పులి ఓ మహిళా ఉద్యోగిపై దాడి చేసింది. ఈ దాడిలో సదరు ఉద్యోగి దుర్మరణం పాలైంది. ఇక్కడి ఓ జూలో ఇరినా అనే సైబీరియన్ జాతి పులి ఉంది. దాని ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ఓ 55ఏళ్ల మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసింది.

ఈ ఘటనతో వెంటనే అక్కడి అలారం మోగి జూ సిబ్బంది మొత్తం అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ పులి ఉన్న ఎన్‌క్లోజర్‌లో ప్రవేశించి, తమ సహోద్యోగినికి సాయం చేయబోయారు. వారిలో కొందరు పులి దృష్టి మరల్చి దూరంగా తీసుకెళ్లారు. వెళ్లి చూడగా ఆ పులి దాడి చేసిన మహిళా ఉద్యోగి అప్పటికే మరణించింది.