AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#Lock down effect కాశీలో వెయ్యి మంది తెలుగోళ్ళు.. పాపం అవస్థలే అవస్థలు

కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఎఫెక్టు వెరసి దేశం నలుమూలలా ప్రజలు పడుతున్న ఇబ్బందాులు అన్ని ఇన్ని కావు. కరోనా ప్రభావాన్ని అంఛనా వేయకపోవడమో లేక లాక్ డౌన్ పరిణామాలను ఊహించకపోవడమో కానీ పలు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళ వేల సంఖ్యలో చిక్కుకుపోయారు.

#Lock down effect కాశీలో వెయ్యి మంది తెలుగోళ్ళు.. పాపం అవస్థలే అవస్థలు
Rajesh Sharma
|

Updated on: Mar 27, 2020 | 3:15 PM

Share

Lock down effected pilgrimage a lot: కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఎఫెక్టు వెరసి దేశం నలుమూలలా ప్రజలు పడుతున్న ఇబ్బందాులు అన్ని ఇన్ని కావు. కరోనా ప్రభావాన్ని అంఛనా వేయకపోవడమో లేక లాక్ డౌన్ పరిణామాలను ఊహించకపోవడమో కానీ పలు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళ వేల సంఖ్యలో చిక్కుకుపోయారు. ఒక్క కాశీ (వారణాసి)లోనే వేయి మందికి పైగా వుండిపోయారంటే పరిస్థితిలో తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్ళి అక్కడ లాక్‌డౌన్ ప్రభావంతో హోటళ్ళలో ఆగిపోయారు. కాశీలో చిక్కుకున్న తెలుగు వారి సంఖ్య వేయికి పైగానే వుంటుందని తెలుస్తోంది. తెలంగాణలోని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోచంపల్లి మండలం దేశ్ ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్యతో పాటుగా 25 మంది కాశీలో చిక్కుకుపోయారు. యాదాద్రి, జనగామ, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. గత నాలుగు రోజులుగా వీరంతా రోజుకు కొందరు చొప్పున తెలుగు మీడియాను ఆశ్రయిస్తున్నారు.

అటు ఏపీలోకి పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో కాశీలో వుండిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో చిక్కుకుపోయి తెలుగు మీడియాను సాయం కోసం అర్థిస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాన్ని కోరుతున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీలో చిక్కుకున్న వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అయితే వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చర్చలంటూ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన విఙ్ఞప్తిని మాత్రం కిషన్ రెడ్డి తోసిపుచ్చినట్లు సమాచారం. కాశీ, ప్రయాగ్ రాజ్‌లలో చిక్కుకున్న వారికి అక్కడ లాక్‌డౌన్ ముగిసే వరకు ఆశ్రయం కల్పించేలా చూస్తానని, ఆహార వసతికి లోటు రాకుండా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రవాణా పూర్తిగా స్థంభించిపోయినందుకు వారిని ఇప్పటికిప్పుడు తరలించడం సాధ్యం కాదని, వారక్కడ క్షేమంగా వుండేట్లు చూసేలా చొరవ చూపుతానని కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.