ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !
వేసవికాలం వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. రికార్డు రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.
వేసవికాలం వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. రికార్డు రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంట్లో ఉన్నా..కూలర్ కానీ, ఏసీ కానీ లేకపోతే కష్టమే. దీంతో మధ్యతరగతి కుటుంబాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఏసీల వినియోగం వల్ల లాభాలు ఏమో గానీ, ఆర్థికంగా.. పర్యావరణం పరంగా మాత్రం నష్టాలే కనిపిస్తున్నాయి. ఏసీలు వినియోగిస్తే కరెంటు బిల్లులు షాక్ కొట్టిస్తాయి. ఇక, ఏసీల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు ఓజోన్ పొరను డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకే, ఈ ఏసీలకు ప్రత్యామ్నాయంగా ఓ యూనివర్సిటీ ‘కూల్ పెయింట్’ను డెవలప్ చేసింది. మాములు పెయింట్ వేస్తే ఇంట్లో కాస్త చల్లదనంగా ఉంటుంది. కానీ, ఈ పెయింట్ వేసుకుంటే ఏసీలు కూడా అక్కర్లేదని డెవలప్ చేసిన ఇంజినీర్లు చెబుతున్నారు.
యూఎస్‌లోని భారత్‌కు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ ఇంజినీర్లు డెవలప్ చేసిన ఈ కూల్ తెలుపు రంగు పెయింట్.. ఎక్కడ వేసినా ఆ ఉపరితలాన్ని సాధారణ ఉష్ణోగ్రత నుంచి 7.8 డిగ్రీలకు తగ్గిస్తుంది. ఈ పెయింట్ వేసిన పరిసరాల్లోకి సూర్యరశ్మి, వేడి చొరబడలేదు. సాధారణ పెయింట్ 80-90 పర్సెంట్ వరకే సూర్యరశ్మి ప్రసరణను అడ్డుకోగలవు. ఈ పెయింట్ మాత్రం 95.5శాతం అడ్డుకోగలదని ఇంజినీర్లు వెల్లడించారు. ఏడేళ్లు కష్టపడి అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరిపి దీన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాల్షియం కార్బొనేట్, భూమిలో కలిసిపోయే ఇతర రసాయనాల సమ్మేళనాలతో దీన్ని తయారు చేశారు. సాధారణంగా ఇంటిపైకప్పు, గోడల ద్వారా వేడి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో ఏసీ వేసుకున్నా అంత ప్రయోజనం ఉండదు. కానీ, ఈ పెయింట్ వేడి, సూర్యకాంతిని లోపలకి రాకుండా బలంగా అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతను తగ్గించి ఇంటి వాతావరణాన్ని కూల్ చేస్తుంది. దీనికి కరెంట్‌తో పనిలేదు. ప్రస్తుతం ఈ పెయింట్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారట.
Also Read :
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు