బీహార్ ఎన్నికలు, ఆర్జేడీ నేత బిట్టూ సింగ్ సోదరుని కాల్చివేత
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత బిట్టూ సింగ్ సోదరుడు బేణీ సింగ్ ని శనివారం పూర్నియా జిల్లాలో దుండగులు కాల్చి చంపారు. మూడో దశ పోలింగ్ జరుగుతుండగా ఈ జిల్లాలోని దాందహా నియోజకవర్గంలోని సర్సి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయనపై కాల్పులు జరిపి వారు పారిపోయారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అటు సాయంత్రం నాలుగు గంటల సమయానికి 44. 6 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ముజఫర్ పూర్ లో ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ […]

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత బిట్టూ సింగ్ సోదరుడు బేణీ సింగ్ ని శనివారం పూర్నియా జిల్లాలో దుండగులు కాల్చి చంపారు. మూడో దశ పోలింగ్ జరుగుతుండగా ఈ జిల్లాలోని దాందహా నియోజకవర్గంలోని సర్సి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయనపై కాల్పులు జరిపి వారు పారిపోయారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అటు సాయంత్రం నాలుగు గంటల సమయానికి 44. 6 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ముజఫర్ పూర్ లో ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి హఠాత్తుగా మరణించాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.



