శ్రియ డాన్స్‌కు.. ఫ్యాన్స్ ఫిదా!

శ్రియ డాన్స్‌కు.. ఫ్యాన్స్ ఫిదా!

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ‘సంతోషం’, ‘శివాజీ’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి శ్రియ. తెలుగులో దాదాపు అగ్రకథానాయకులతో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తున్న ఈమె.. తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో హాలిడే స్పెండ్ చేస్తోంది. అక్కడ బీచ్‌లో ఆమె డాన్స్ చేస్తున్న వీడియో తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భర్తతో దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. […]

Ravi Kiran

|

Sep 05, 2019 | 2:56 AM

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ‘సంతోషం’, ‘శివాజీ’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి శ్రియ. తెలుగులో దాదాపు అగ్రకథానాయకులతో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తున్న ఈమె.. తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో హాలిడే స్పెండ్ చేస్తోంది. అక్కడ బీచ్‌లో ఆమె డాన్స్ చేస్తున్న వీడియో తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భర్తతో దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

చిన్నపిల్ల మాదిరి ఉత్సాహంగా చిందులేసిన శ్రియను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘సో క్యూట్‌’, ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రియ 2018లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆండ్రీని ప్రేమ వివాహం చేసుకుంది.

 

 

View this post on Instagram

 

Once upon a time in Ibiza. Will miss island 🌴 life …. till next time. @andreikoscheev

A post shared by @ shriya_saran1109 on


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu