Dangerous Insect: తరుచుగా కనిపించే ఈ కీటకం వెరీ డేంజర్.. ఒక్కసారి కరిచిందో అంతే సంగతులు..
సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులుంటాయి. అందులో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎవరైనా దీని జోలికి వస్తే వారిపై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఫలితంగా మరే ఇతర జీవి
సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులుంటాయి. అందులో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎవరైనా దీని జోలికి వస్తే వారిపై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఫలితంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు. దాని పేరే గ్రౌండ్ బీటిల్. ఇతర జీవుల దాడుల నుంచి తప్పించుకునేందుకు దీనికి ఈ ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అందుకే దీనిని బాంబార్డియర్ బీటిల్ అని పిలుస్తుంటారు. అంటార్కిటికా మినహా భూమిపై ఉన్న అన్ని ఖండాల్లోనూ ఈ కీటకానికి సంబంధించి 500 జాతులున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ కీటకం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.ఈ కీటకం శరీరంపై పెంకులాంటి నిర్మాణం ఉంటుంది. ఏవైనా జీవులు దాడిచేసేందుకు వచ్చినప్పుడు తప్పించుకోడానికి ఇది అన్ని కీటకాల్లాగా వెంటనే గాల్లోకి ఎగరలేదు. తనను తాను రక్షించేందుకు రసాయన బాంబులను వదులుతుంది. వీటికారణంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు. ఈ కీటకం కడుపులోనే విషపూరిత వాయువులుంటాయట. శరీరంలో ఉండే రెండు వేర్వేరు గ్రంథులనుంచి ఆక్సిజన్, హైడ్రోక్వినోన్ అనే వాయువులు విడుదలవుతాయి. ఇవి రెండూ కలిసి అతి ప్రమాదకరమైన బెంజోక్వినోన్‌గా మారతాయి. ఈ డేంజరస్ బీటిల్ ఒకేసారి 20 రసాయనిక వాయువులను విడుదల చేస్తుంది. అవి వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసిపోయి బాంబుల్లాగా పాప్ అనే శబ్ధం చేస్తూ విడుదలవుతాయి. ఇది ఇతర జీవులకు చికాకు తెప్పించడంతో పాటు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ కీటకంపై దాడి చేసేందుకు ఇతర జీవులు సాహసించవు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..