మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్.. పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను భుజాలపై..

కడప జిల్లాలో ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను భూజాలమీద మోసుకెళ్ళిన స్పెషల్ పార్టీ పోలీస్ షేక్ అర్షద్.

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్.. పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను భుజాలపై..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 23, 2020 | 7:10 PM

కడప జిల్లాలో ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను భూజాలమీద మోసుకెళ్ళిన స్పెషల్ పార్టీ పోలీస్ షేక్ అర్షద్. కడప జిల్లా తిరుమలలో బుధవారం ఈ ఘటన జరిగింది.

రాజంపేట మాజీ శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులతో కాలినడకన అన్నమయ్య మార్గం ద్వారా మహాపాదయాత్ర చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తిరుమలకి కాలినడకన వెళ్తున్నారు. మార్గ మధ్యలో హైబీపీతో నాగేశ్వరమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాడు కానిస్టేబుల్ అర్షద్. ఆ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ షేక్ అర్షద్‏ను జిల్లా ఎస్‏పి అన్బు రాజన్ అభినందించారు.