ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మూడో తాకిడి మొదలైందా ? అక్కడి ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటన చూస్తే నిజమేనని తేలింది. మహానగరంలో కరోనా కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తుండడమే ఇందుకు నిదర్శనమని మంత్రి ప్రకటించారు.

ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

Updated on: Nov 04, 2020 | 3:36 PM

Third wave of corona in New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా మొదలైందంటున్నారు అక్కడి ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్. గత నాలుగైదు రోజులుగా చాలా వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులే ఇందుకు నిదర్శనమని ఆయన చెబుతున్నారు. అయితే.. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో వేగం పెరగడం కూడా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల విషయంలో బుధవారం సమీక్ష జరిపిన ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్.. దేశరాజధాని పరిధిలో మొత్తం 9 వేల కోవిడ్ ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేయగా.. 6,800 బెడ్స్ ఆక్యుపై అయ్యాయని, నగరంలో థర్డ్ వేవ్ కరోనా ప్రభావం మొదలైనట్లుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే.. గత పదిహేను రోజులుగా మహానగరంలో కరోనా టెస్టుల సంఖ్య పెరగడం వల్ల కూడా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయనంటున్నారు.

తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో ప్రస్తుతం 36 వేల 375 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు నగరంలో 3 లక్షల 60 వేల 69 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం ఆరు వేల 652 మందిని ఇప్పటి వరకు వైరస్ పొట్టన పెట్టుకుంది.

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం