వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

తిరుమలేశుని సన్నిధిలోని వరాహ స్వామి వారి ఆలయానికి మహా యోగం పట్టబోతోంది. శ్రీవారి ఆలయానికి చెంతనే వున్నా.. ఇంతకాలం పెద్దగా ఆదరణకు నోచుకోని వరాహ స్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ జరిపి. జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం
Follow us

|

Updated on: Nov 04, 2020 | 4:09 PM

Gold coating for Varahaswamy temple: తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పుష్కరిణిని ఆనుకుని వున్న వరాహ స్వామి ఆలయానికి బంగారు తాపడం (గోల్డు కోటింగ్) చేయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు నిర్ణయించింది. బంగారు పూత పూసిన రాగి రేకులను వరాహ స్వామి ఆలయం విమాన శిఖరానికి అమర్చాలని తలపెట్టారు. ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల క్షేత్రంలో వరాహస్వామి ఆలయానికి వున్న పురాణ విశిష్టత అందరికీ తెలిసిందే. తిరుమలేశుడు శ్రీనివాసున్ని దర్శించుకునే ముందే పుష్కరిణి చెంతనే వున్న వరాహ స్వామిని సందర్శించాలని పురాణాలు సూచిస్తున్నాయి. అప్పుడే తిరుమలేశుని దర్శన పుణ్యం భక్తులకు లభిస్తుందని వరాహ పురాణంలో ప్రస్తావించినట్లు చెప్పుకుంటారు.

అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వున్న వరాహ స్వామి ఆలయం జీర్ణోద్ధరణ కోసం డిసెంబర్ 6వ తేద నుంచి 10వ తేదీ వరకు బాలాలయం మహా సంప్రోక్షణ నిర్వహించాలని తలపెట్టారు. ఆ అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగే రోజుల్లో ఆలయ ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి.. చెక్క విగ్రహాలను ప్రతిష్టిస్తారు. అనంతరం ఆలయ విమాన శిఖరానికి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయించింది. బంగారు తాపడం అమర్చే పనులు సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు అంఛనా వేస్తున్నారు. ఈ కాలంలో వరాహ స్వామి వారి దర్శనం నిలిపి వేయాలని నిర్ణయించారు.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..