హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం

ట్రబుల్ షూటర్‌గా పేరున్న తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు తాజాగా ఆ పేరును మరోసారి సార్థకం చేసుకున్నారు. మెతుకుసీమ రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిన ఓ సమస్యను పరిష్కరించి వారి మన్నన పొందారాయన.

హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం
Follow us

|

Updated on: Nov 04, 2020 | 3:36 PM

Harishrao solves farmers problem: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చొరవతో సంగారెడ్డి జిల్లా చెరుకు రైతుల సమస్య సత్వరమే పరిష్కారమైంది. దాదాపు పది వేల మంది చెరుకు రైతుల సమస్యను పరిష్కరించిన హరీశ్ రావును రైతాంగం ప్రశంసించింది. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రైతుల సమస్యను పరిష్కరించారు హరీశ్ రావు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు భారీ ఎత్తున చెరుకు పంట వేశారు. అయితే అక్కడి ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ యాజమాన్యం చెరుకు రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. దాంతో తాము కష్టపడి పడించిన చెరుకు పంటను కొనే వారు లేరంటూ పదివేల మంది రైతాంగం ఆందోళనకు గురైంది. ఈ రైతాంగం ప్రతినిధులంతా జిల్లా మంత్రి హరీశ్ రావును ఆశ్రయించారు. దాంతో ఆయన సంగారెడ్డిలో సమావేశం ఏర్పాటు చేసి.. ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ యాజమాన్యంతోపాటు సంగారెడ్డి గణపతి షుగర్స్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు.

బుధవారం జరిగిన ఈ సమావేశంలో జహీరాబాద్ ఏరియాలో పండిన చెరుకు పంటను కూడా సంగారెడ్డి గణపతి షుగర్స్ యాజమాన్యంమే కొనుగోలు చేయాలని, సంగారెడ్డి ప్రాంత చెరుకు రైతులకు ఇస్తున్న విధంగానే జహీరాబాద్ రైతులకు ధర చెల్లించాలని హరీశ్ రావు ఆదేశించారు. అదే సమయంలో ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ రైతాంగానికి బకాయి పడిన మొత్తాలను కూడా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హరీశ్ రావు చూపిన చొరవతో 10 వేల మంది రైతులకు ఊరట లభించిందని రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ