AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పాత రూ.20 నోటపై ఉన్న ఈ చిత్రం గుర్తుందా?.. ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా?

సాధారణంగా కరెన్సీ నోట్లపై చారిత్రక కట్టడాలు, గోప్ప వ్యక్తుల చిత్రాలను మనం చూస్తూ ఉంటాయి. అయితే మీరు పాత 20 రూపాయల నోటును చూసే ఉంటారు. కానీ ఎప్పుడైన దాని వెనుక వైపు ముద్రించిన చిత్రాన్ని గమనించారా? చూసుంటే అదేదో సాధారణమైన ప్రకృతి చిత్రమని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి, అది మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. ఆ ప్రదేశం ఏదో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

Viral News: పాత రూ.20 నోటపై ఉన్న ఈ చిత్రం గుర్తుందా?.. ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా?
Old 20 Rupee Note Image
Anand T
|

Updated on: May 02, 2026 | 8:16 PM

Share

పాత 20 రూపాయల నోటు వెనుక ఉన్న దృశ్యం ఏదో సాధారణమైన ప్రకృతి చిత్రమని చాలామంది అనుకుంటారు. కానీ, అది వాస్తవానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతానికి చెందిన యథార్థ దృశ్యం. ఈ నోటుపై ఉన్న ఆ అందమైన దృశ్యం అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్త్ బే ఐలాండ్ కి సంబంధించింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఉన్న ఈ ద్వీపాన్ని కోరల్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్తే మనం నోటుపై ఉన్న తాటి చెట్లు, లైట్‌హౌస్‌ను చూడవచ్చు.

అయితే ఓ కంటెంట్ క్రియేటర్ తాజాగా ఈ నోటుపై ఉన్న చిత్రం నిజమైన ప్రదేశమేనా అని తెలుసుకోవడానికి స్వయంగా పోర్ట్ బ్లెయిర్ వెళ్లి ఆ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అతను పోస్ట్ చేసిన వీడియోలో నోటుపై ఉన్న లైట్‌హౌస్ , తాటి చెట్లు, అక్కడి వాస్తవ దృశ్యాలు మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. అతను ఓ చేతిలో నోటును పట్టుకుని మరో చేతితో ఆ ప్రాంతాన్ని చూపిస్తుంటే రెండు దృశ్యాలు ఒకేలా ఉండటం మనం చూడవచ్చు.

పోస్ట్‌ ఇక్కడ చూడండి.

View this post on Instagram

A post shared by Sonu Sandy (@sonu_sandy25)

కొత్త నోటుపై ఏముంది?

పాత నోటుతో పాటు, ప్రస్తుతం మనం వాడుతున్న కొత్త 20 రూపాయల నోటు వెనుక కూడా ఒక చారిత్రక కట్టడం ఉంది. కొత్త నోటుపై మహారాష్ట్రలోని ప్రపంచ ప్రసిద్ధ ఎల్లోరా గుహల చిత్రాన్ని మనం చూడవచ్చు. ఈ గుహలు తమ అద్భుతమైన వాస్తుశిల్పానికి, చారిత్రక ప్రాముఖ్యతకు ఎంతో ప్రసిద్ధి చెందినవి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us