కశ్మీర్ సరిహద్దుల్లో బస్సు సర్వీసులు రద్దు

ఫూంచ్ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్ర దాడి, సరిహద్దుల్లో ఎదురుకాల్పుల నేపథ్యంలో ఫూంచ్ -రావల్‌కోట్ బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సరిహద్దుల్లోని ఫూంచ్ సెక్టార్ లో గత రాత్రి పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. ఫూంచ్ -రావల్‌కోట్ తో పాటు శ్రీనగర్- ముజఫ్పరాబాద్ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుల్వామా ఉగ్రదాడి, సరిహద్దుల్లో తీవ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పుల దృష్ట్యా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి కుదుటపడ్డాక సర్వీసులను […]

కశ్మీర్ సరిహద్దుల్లో బస్సు సర్వీసులు రద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:47 PM

ఫూంచ్ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్ర దాడి, సరిహద్దుల్లో ఎదురుకాల్పుల నేపథ్యంలో ఫూంచ్ -రావల్‌కోట్ బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సరిహద్దుల్లోని ఫూంచ్ సెక్టార్ లో గత రాత్రి పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. ఫూంచ్ -రావల్‌కోట్ తో పాటు శ్రీనగర్- ముజఫ్పరాబాద్ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుల్వామా ఉగ్రదాడి, సరిహద్దుల్లో తీవ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పుల దృష్ట్యా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి కుదుటపడ్డాక సర్వీసులను పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు