Telangana News: ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్.. చూడడానికి రెండు కండ్లు చాలవ్..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అదే విధంగా ఓ కళకారుడు ఆవాలతో మన్మోహన్ సింగ్ ఆర్ట్ వేసి తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఆవాలతో దివంగత నేత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్ట్ వేసి ఆయనపై ఉన్న ప్రేమను చూపించాడు ఓ కళకారుడు.. ఆయన మరణం బాధాకరమని అయనకు ఘన నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.. తెలంగాణ ఇచ్చిన నేత మరణం ఎంతో బాధాకరం అని, ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయిందని, తనదైన ప్రతభ, జ్ఞానంతో భారత దేశానికి ప్రధానిగా అపూర్వ సేవలందించిన మహానీయుడని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఎన్నో దశబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేర్చింది మన్మోహనే అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇలా ఆవాలతో మన్మోహన్ చిత్రాన్ని చిత్రించి ప్రార్థిస్తున్ననట్లు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి