ఉద్దవ్ థాక్రేకి దావూద్ ఫోన్ కాల్, అంతా ‘వట్టిదే’, శివసేన

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేకి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపు కాల్ అందినట్టు వచ్చిన  వార్తను శివసేన నేత అనిల్ పరాబ్ తేలిగ్గా  కొట్టిపారేశారు. అది బహుశా వట్టి ఫేక్ కాల్ అయినట్టు కనిపిస్తోందన్నారు..

ఉద్దవ్ థాక్రేకి దావూద్ ఫోన్ కాల్, అంతా వట్టిదే, శివసేన

Edited By:

Updated on: Sep 07, 2020 | 11:12 AM

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేకి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపు కాల్ అందినట్టు వచ్చిన  వార్తను శివసేన నేత అనిల్ పరాబ్ తేలిగ్గా  కొట్టిపారేశారు. అది బహుశా వట్టి ఫేక్ కాల్ అయినట్టు కనిపిస్తోందన్నారు. అది అసలు బెదిరింపు కాల్ కాదని, ఆ కాల్ ని ఉధ్ధవ్ కి ఇవ్వాలని ఎవరో అజ్ఞాత వ్యక్తి కోరినా ఆపరేటర్ దాన్ని ఆయనకు ట్రాన్స్ ఫర్ చేయలేదని అనిల్ చెప్పారు. ఉధ్ధవ్ థాక్రే తో దావూద్ మాట్లాడాలనుకుంటున్నాడని ఆ వ్యక్తి చెప్పాడన్నారు.  దుబాయ్ నుంచి అది అందినట్టు తెలుస్తోంది. ఇందులో బెదిరింపు ధోరణులు లేవు అని చెప్పిన అనిల్.. ఏది ఏమైనా పోలీసులు ఈ కాల్ విషయమై ఇన్వెస్టిగేట్ మొదలుపెట్టారని తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యగా ఉధ్ధవ్ నివాసమైన ‘మాతోశ్రీ’ వద్ద భద్రతను మరింత పెంచారు.