‘థ్యాంక్యూ’ షూటింగ్ షురూ చేయనున్న చైతూ !

|

Nov 17, 2020 | 4:14 PM

అక్కినేని వారసుడు నాగచైతన్య తన కొత్త చిత్రం 'థ్యాంక్యూ' చిత్రీకరణను త్వరలోనే షురూ చేయనున్నాడు. డిసెంబరు నుంచి రెగ్యులర్​ షూటింగ్​ స్టార్టవ్వనుంది.

థ్యాంక్యూ షూటింగ్ షురూ చేయనున్న చైతూ !
Follow us on

అక్కినేని వారసుడు నాగచైతన్య తన కొత్త చిత్రం ‘థ్యాంక్యూ’ చిత్రీకరణను త్వరలోనే షురూ చేయనున్నాడు. డిసెంబరు నుంచి రెగ్యులర్​ షూటింగ్​ స్టార్టవ్వనుంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అయితే చైతూ ఈ సినిమాలో హీరోయన్లతో ఆడిపాడబోతున్నారట.  ఇప్పటికే ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెెచ్చుకుంది ఈ భామ‌.

మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం మూవీ యూనిట్ వెతుకులాట షురూ చేసింది. నాగచైతన్య ఇన్నాళ్లూ ‘లవ్‌స్టోరీ’ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య  కొత్త లుక్‌లో కనిపిస్తారట. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మధురమైన దృష్యకావ్యాన్ని గిఫ్ట్‌గా అందించారు  విక్రమ్ కే కుమార్. మరి చైతూకి ఈసారి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

నాగచైతన్య ఇన్నాళ్లూ ‘లవ్‌స్టోరీ’ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నారయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి పల్లవి చైతూ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read :

పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది

విషాదం.. దీపావళి వేడుకల్లో బీజేపీ ఎంపీ మనవరాలు మృతి

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ‘రియల్ హీరో’ సోనుసూద్‌