AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman: మెగా ఛాన్స్‌ కొట్టేసిన థమన్‌.. అతి పెద్ద కల నిజమవుతున్న వేళ అంటూ ట్వీట్‌..

Thaman Work In Chiru Movie: అనతికాలంలో మంచి పేరు సంపాదించుకున్నాడు సంగీత దర్శకుడు థమన్‌. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలకు పని చేయడమే కాకుండా అదే స్థాయిలో విజయాల్ని అందుకున్నాడీ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌...

Thaman: మెగా ఛాన్స్‌ కొట్టేసిన థమన్‌.. అతి పెద్ద కల నిజమవుతున్న వేళ అంటూ ట్వీట్‌..
Narender Vaitla
|

Updated on: Jan 20, 2021 | 3:07 PM

Share

Thaman Work In Chiru Movie: అనతికాలంలో మంచి పేరు సంపాదించుకున్నాడు సంగీత దర్శకుడు థమన్‌. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలకు పని చేయడమే కాకుండా అదే స్థాయిలో విజయాల్ని అందుకున్నాడీ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు థమన్‌. ఇక కొత్తేడాది కూడా థమన్‌కు అచ్చొచ్చిందనే చెప్పాలి. ఏడాది తొలి నాళ్లలోనే ‘క్రాక్‌’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న థమన్‌ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. చిరు హీరోగా లూసిఫర్‌ సినిమా రీమేక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు థమన్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కన్ఫామ్‌ చేశారు.

ఈ విషయాన్ని థమన్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. చిరంజీవి ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ ఏ సంగీత దర్శకుడికైనా అతిపెద్ద క‌ల‌. నా క‌ల నిజ‌మ‌వుతున్న వేళ‌.. మ‌న బాస్ మెగాస్టార్, ప్రియ‌మైన సోదరుడు మోహ‌న్ రాజాపై నా ప్రేమ‌ను చూపించే స‌మ‌యం’ అంటూ రాసుకొచ్చాడు. ఈ విధంగా థమన్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Also Read: పిట్ట కథలు టీజర్ రివ్యూ: నాలుగు విభిన్న కథలు.. డిఫరెంట్ ఎమోషన్స్.. ఒక్క సినిమా.!