ఎన్‌సీ నేత ఇంటిపై గ్రైనేడ్ ఎటాక్
జమ్ముకశ్మీర్ : సార్వత్రిక ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ట్రాల్ ప్రాంతంలోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అష్రఫ్ భట్ ఇంటిపై ఉగ్రవాదులు గ్రైనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన గాయపడగా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సమయంలో అష్రఫ్ ఇంట్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనంతనాగ్ పార్లమెంట్ అభ్యర్ధి హస్నైన్ మసూదీ కార్యకర్తలతో సమావేశంలో ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.