బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారికి గుడ్ న్యూస్ చెబుతూ ఓ ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో బిగ్ బాస్ సీజన్-4 జరుగుతుందో? లేదా? అనే సందేహాల నడుమ ఎట్టకేటకు స్టార్ మా లేటెస్ట్‌గా ప్రోమోను విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంతో పకడ్భందీగా బిగ్ బాస్ షోను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు నిర్వాహకులు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమోను విడుదల చేసింది యూనిట్. కాగా బిగ్ బాస్-4 షోలో మొత్తం 16 మంది పాల్గొనబోతుండగా మరోసారి హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జరగనుంది,
ఈ లేటెస్ట్ ప్రోమోలో.. నాగార్జున వృద్ధుడి గెటప్‌లో కనిపించారు. టెలీస్కోప్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోతో బిగ్ బాస్ సీజన్ 4పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఈ బిగ్ బాస్-4 షూటింగ్‌ని ఆగష్టు 29న నాగార్జున పుట్టిన రోజు స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నుంచి రెగ్యులర్‌గా షోను ప్రసారం చేయాలనే ఆలోచనలో స్టార్ మా నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ సీజన్-4 ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
Next em jarugutundo chudataniki stay tuned!!!#BiggBossTelugu4 coming soon on @StarMaa pic.twitter.com/hdkyJe6FuL
— starmaa (@StarMaa) August 12, 2020
Read More:
ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వ హెచ్చరిక