పశ్చిమబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 36 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి. 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్దమైంది. రెండు లాంచీలను సహాయక చర్యలకు అధికారులు సిద్దంగా ఉంచారు. మరోవైపు ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు బయటికి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షంలో గంటలతరబడి రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.