పాప్‌కార్న్ తింటూ.. అమెరికా వీధుల్లో బాబు.. వీడియో వైరల్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుటుంబంతో అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం అక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా పాప్‌ కార్న్ తింటూ.. ఎన్‌ఆర్‌ఐలతో కలిసి మిన్నెపోట వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.. తమ అధినేతకు చాలా రోజుల తరువాత కుటుంబంతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:53 am, Fri, 2 August 19
పాప్‌కార్న్ తింటూ.. అమెరికా వీధుల్లో బాబు.. వీడియో వైరల్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుటుంబంతో అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం అక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా పాప్‌ కార్న్ తింటూ.. ఎన్‌ఆర్‌ఐలతో కలిసి మిన్నెపోట వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.. తమ అధినేతకు చాలా రోజుల తరువాత కుటుంబంతో గడిపే అవకాశం వచ్చిందంటూ సంబరపడిపోతున్నారు. కాగా జూలై 28న అమెరికాకు వెళ్లిన ఆయన.. త్వరలో రాష్ట్రానికి రానున్నారు.